అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ జి. చంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు సోమవారం సంయుక్తంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు , జూనియర్ అసిస్టెంట్ బి ఎస్ చక్రవర్తి , ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.