ఏపీలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం 2023లో దిగ్గజాల పోరుకు వేదిక కానుంది. 2014లో ఇక్కడ గెలిచిన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మంత్రి కాగా.. 2019లో ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావూ మంత్రి అయ్యారు. కానీ.. 2019లో విశాఖనార్త్లో గెలిచిన గంటా.. 2023లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యేందుకు రెడీ అవుతుండగా, తన రాజకీయగురువుకు చెక్ పెట్టేదిశగా అవంతి అడుగులువేస్తున్నారు.