మండలంలోని కొంగాటంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే గౌడ పాల్గొన్నారు. ఆయన గడప గడపకి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఎవరి ప్రమేయం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ యువరాజు తదితరులు పాల్గొన్నారు.