ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడించడానికి వైసీపీ ఇన్చార్జి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. చలో తూర్పు నాయుడుపాలెం అంటూ... ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి అశోక్ బాబు పిలుపునిచ్చారు. వైసీపీకి కౌంటర్‌గా చలో టంగుటూరు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు నాయుడుపాలెంలో ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకి టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. వైసీపీ ఇన్చార్జ్ అశోక్ బాబు తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.