తిరుమలలో తాజాగా విమాన సంచారం కలకలం సృష్టించింది. తిరుమల క్షేత్రానికి అతి సమీపంలో విమానం ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో విమానం క్షేత్రం మీదుగా ప్రయాణించింది. సాధారణంగా ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదనే ఆగమ నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ విమానం తిరుమల ఆలయానికి సమీపంలో ప్రయాణించడం కలకలం రేగింది. ఇటీవల తరుచూ క్షేత్రం మీదుగా విమానాలు ప్రయాణిస్తున్న క్రమంలో టీటీడీ మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa