పల్నాడు జిల్లా, దాచేపల్లిలోని దావత్ రెస్టారెంట్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కగా ఆగివున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు సుమారు 140 కిలోమీట్ల వేగంతో వచ్చి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఓ యువ కుడు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాచేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా, కందుకూరుకు ప్రయాణం చేస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఆదివారం తెల్లవారు జామున 4గంటల సమయంలో దాచే పల్లిలో రోడ్డుపక్కగా ఆగివున్న లారీని అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. బస్సు డ్రైవరు నిద్రమత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణీకులు వున్నారు. ఈప్రమాదంలో మృతి చెందినవ్యక్తి గడ్డం గోపి (25)గా గుర్తించారు. మృతుడు ఎస్‌పీఎస్ నెల్లూరుజిల్లా, బల్లికురువ మండలం, కొనిదన గ్రామానికి చెందిన తాపీ మేస్ర్తీగా గుర్తించారు. ఒంగోలుకు చెందినషేక్ బాజిమ, మద్ది పాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన వల్లెపు వెంకటరావు, అన్నపూర్ణ దంప తులు, మరో వ్యక్తికి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో గుర జాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాచేపల్లి సీఐ బిలాలుద్దీన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.