వైసీపీ ప్రభుత్వంలో రైతులు దగా పడ్డారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలంలోని కనపర్రు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల జతలు, ట్రాక్టరుతో ర్యాలీగా వెళ్ళి వినాయకుని ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పొలంలో దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకంలో భాగంగా రైతులకోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అధినేత చంద్రబాబు ప్రకటించేందుకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకివస్తే రైతులకు స్వర్ణ యుగం వస్తుందన్నారు. జూన్ వచ్చినా ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళి కపై ఇంతవరకు ఉన్నతస్థాయి సమీక్ష లేకపోవటం విచారక రమ న్నారు. కార్యక్రమంలో పరిశీలకురాలు దాసరి ఉషారాణి, నాయ కులు మద్దూరి వీరారెడ్డి, షేక్‌కరిముల్లా, సదాశివరావు, సత్యనారా యణ, సింగయ్య, జయ ప్రసాదు, కిషోర్, సీతారామయ్య, సోమేపల్లి అశోక్, ఖాజా మొహిద్దీన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.