రెజ్లర్ల ఆందోళన నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడటంతో ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాను తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమన్నారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో ఎవరూ కూడా వెనుకంజ వేయలేదన్నారు. రైల్వేల్లో తన బాధ్యతను నెరవేరుస్తున్నానని చెప్పారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.