ఈ నెల 8 వ తేదీన విశాఖ లో జరగబోయే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభ ను విజయవంతం చేయాలనీ ఉత్తరాంధ్ర పట్ట భద్రుల మాజీ ఎమ్మెల్సీ, మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివియన్ మాధవ్ అన్నారు. పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయం గాజువాక బీజేపీ కన్వినర్ కర్ణంరెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రధాని తొమ్మిది ఏళ్ల పాలన లో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని ఎక్కడ ఒక్క అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. అలాగే దేశం లో అనేక సంస్కరణ లు చేపట్టారని అనేక సంక్షేమ పధకాలును కూడా ప్రవేశపెట్టారని మహిళ లకు పెద్ద పీట వేసి వారికీ ఉన్నత స్థాయి కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది అని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా బీజేపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్ లు, పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది అని వాటి కోసం రేపు జరగబోయే బహిరంగ సభ లో ప్రజల కు వివరిస్తాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే, అటు కేంద్రం లో, ఇటు రాష్టం లో డబల్ ఇంజిన్ పాలన తో రాష్టం మరింత అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమం లో దీనకొండ కృష్ణం రాజు, గుటూరు శంకరావు, బాట శ్రీను, పేర్ల సత్యారావు, ఉమ్మిడి దేముడు, పేర్ల అప్పారావు, జీలకర్ర రమణ, అప్పలరాజు , తాతారావు, సత్తిబాబు , ప్లీడర్ ఈశ్వరరావు , రంజిత్ , తాతరావు, వర్రీ లలిత, జీలకర్ర భువనేశ్వరి, స్వామి, లావణ్య, రాజశేఖర్, మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.