ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సిసోడియా దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. పోలీసు కస్టడీలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తన భార్యను కలవడానికి అనుమతి ఇచ్చింది. కాగా తన భార్య అనారోగ్యం కారణంగా తనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోర్టును ఆశ్రయించారు.