బ్లేడ్ బ్యాచ్‌లను పంపి, సుపారీ దాడులు చేయించడం తమకు పెద్ద పనికాదని టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అయితే అలాంటి సంస్కృతిని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహించరన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేయమంటారా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాకపోతే, తామే చూసుకుంటామన్నారు.