ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో లోపమే ప్రధాన కారణమని తేలడంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రిలే రూమ్లు, సిగ్నల్ వ్యవస్థలో పరికరాలకు డబుల్ లాకింగ్ ఏర్పాట్లు చేయాలని, లోపాలుంటే తెలియజేయాలని అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. రిలే రూమ్ తలుపు తెరవడం/ మూయడం కోసం డేటా లాగింగ్ వంటివి కూడా తనిఖీ చేయాలని సూచించింది.