ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TSICET పరీక్షలను గత నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఈ 'కీ' పై అభ్యంతరాలుంటే ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని ఐసెట్ కన్వీనర్ తెలిపారు. www.icet.tsche.ac.in వైబ్ సైట్ లో 'కీ' ని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ నెల 20న తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa