పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాన్గావ్ టౌన్ పరిధిలోని బక్షిపల్లి ప్రాంతంలో సైకిల్ గ్యారేజీలో పనిచేసే 11 ఏళ్ల రాజు రాయ్ మరుగుదొడ్లలో బాంబు పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో రాజు టాయిలెట్ లోకి వెళ్లగా బాంబు పేలింది. దీంతో బాలుడు మృతిచెందాడు. బాంబు నిర్వీర్యక దళం ఆ మరుగుదొడ్ల నుంచి మరో 8 గ్రనేడ్లను స్వాధీనం చేసుకుంది.