తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. ఒంగోలు నగరం రాజాపానగల్ రోడ్డులోని యూనియన్ బ్యాంకు చెస్ట్ గార్డుగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మర్రిపూడి వెంకటేశ్వర్లు (35) విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం విధుల్లో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు.