తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం పంచాయతీ గోవర్ధనపురంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధి సక్రమంగా అందుతుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు బ్రోచర్లను అందించారు. వారి సమస్యలు తెలుసకున్నారు.