ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ లోపమే కారణమని తెలుస్తోంది. కాగా, దీనిపై 3 నెలల క్రితం ఏ అధికారి రాసిన లేఖ తాజాగా బయటికొచ్చింది. గతంలో పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేసిన హరిశంకర్ ఇంటర్ లాకింగ్ కై రూపొందించిన సిస్టమ్ ను బైపాస్ గా మార్చగా లొకేషన్ బాక్సులో లోపాలు గుర్తించారు. దీన్ని నిలిపివేయాలని, రైలు బయల్దేరాక డిస్పాచ్ రూట్ మారుతోందని, దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డుకు లేఖ రాశారు.