ప్రభుత్వం నిర్వహించే అసైన్ మెంటు కమిటీలో దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఐ తొండూరు మండల కార్యదర్శి ఎం. మురళి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో తొండూరు మండల దళితులతో కలిసి ఆయన ఆర్డిఓ వెంకటేశులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్ మెంట్ కమిటీ ద్వారా సాగు భూములను అర్హులైన పేదవారికి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.