మైదుకూరు పట్టణ పరిధిలోని నంద్యాల రోడ్ లోని జాతీయ రహదారి 40 లో శ్రీ నగరం వద్ద క్రాసింగ్ పెట్టకుండా చేసిన చిన్న తప్పిదం వల్ల గత 15 సంవత్సరాలుగా నాలుగు గ్రామాల ప్రజలు, రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ పేర్కొన్నారు. మంగళవారం రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సమస్య ఉన్న ప్రాంతంలోనే సమావేశమై మాట్లాడుతూ. గత 15 సంవత్సరాలుగా రోడ్డు క్రాస్ లేకపోవడం వల్ల నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలకు ఎదురుగా రోడ్డుకు ఒక సైడు లోనే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని, రైతులు తమ పోలాలకి ఆ సైడు ఈ సైడు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, ఈ సమస్యపై వెంటనే జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించి రోడ్డు క్రాసింగ్ అవకాశం కల్పించకపోతే రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల ప్రజలు రైతులు, నాయకులు ధనపాల యుగంధర్, గోశెట్టి రాఘవేంద్ర, తుపాకుల వెంకటరామయ్య, బండి రాజా, మామిళ్లపల్లె కృష్ణయ్య, గొర్ల రామ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.