తమ ఆస్తులను ఎంపీ వంగా గీత బలవంతంగా రాయించుకున్నారంటూ ఆమె వదిన కళావతి సోమవారం కాకినాడ జిల్లాలోని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2006లో తన భర్త కృష్ణకుమార్‌తో తన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వంగా గీత సోదరుడు కృష్ణకుమార్ 2010లో మృతి చెందారు. ఇప్పుడు ఎంపీ వంగా గీత, ఆమె సోదరి కుసుమకుమారి దంపతులపై కళావతి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు కోర్టులో పోరాడుతుంటే బెదిరిస్తున్నారని, చంపేస్తారన్న భయంతో తమ అబ్బాయి రెండునెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడని తెలిపారు.