ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా కోమర్తి జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa