బీజేపీపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కాషాయ్ హయాంలో యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. కన్నౌజ్‌లో ఓ ఎంపీ తన గూండాలతో వెళ్లి ఔట్‌పోస్టులో ఉన్న పోలీసులందరినీ కొట్టినా యోగి సర్కార్ ప్రేక్షక పాత్రకు పరిమితమైందని పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీలో మహిళా రెజ్లర్లు నిరసనలతో గళమెత్తినా మోదీ సర్కార్ నోరు మెదపడం లేదని విమర్శించారు.