గోహత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలని పిలుపునిస్తూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై విస్తృత నిరసనల మధ్య, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని రాబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని చెప్పారు. గత బిజెపి ప్రభుత్వం అమలు చేసిన చట్టంలో స్పష్టత లేకపోవడం పట్ల సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు మరియు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరుపుతుందని ధృవీకరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై కేబినెట్లో చర్చిస్తాం.. ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని సిద్ధరామయ్య తెలిపారు.