ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తమ యాప్ ద్వారా యూజర్లు అందించే విరాళాలకు సమాన మొత్తంలో డబ్బును ఒడిశా సీఎం సహాయనిధికి జమ చేస్తామని ప్రకటించింది. అలాగే, విరాళం ఇచ్చిన వారు 80జీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చని, ఆర్డర్స్& బుకింగ్స్ సెక్షన్ నుండి రసీదులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.