తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.