ఒడిశాలో రైలు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. 'బాధితులకు గోధుమపిండి, షుగర్, బియ్యం, పప్పు, మందులతో సహా అన్ని రకాల నిత్యావసరాలను 6 నెలలపాటు ఫ్రీగా అందిస్తాం. జీవనోపాధి కోసం ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు అందిస్తాం. ఏడాది పాటు ఉచిత జియో కనెక్టివిటీ ఉంటుంది. కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి వీల్ ఛైర్లు, ఇతర పరికరాలు అందజేస్తాం' అని ఫౌండేషన్ వెల్లడించింది.