రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హజ్ 2023 యాత్రకు సర్వం సిద్ధం చేశామని డిప్యూటి సిఎం అంజాద్ బాషా వెల్లడించారు. బుధవారం ఉదయం పెదకాకాని మండలం నంబూరు నుండి హజ్ యాత్ర కు బయలు దేరుతున్న 1814 మంది హాజీల తొలి బస్సును ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.