నరసరావుపేట పట్టణంలోని నూనె మిల్లులు, హోటళ్లల్లో జిల్లా ఆహార పదార్థాల తనిఖీ విభాగం అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఓ హోటల్లో ఆహార పదార్థాల తయారీ, ఎలాంటి నూనెలు వినియోగిస్తున్నారన్నది తెలుసుకున్నారు. అలాగే పలు ట్రేడర్స్ లో శనగ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు పరిశీలించి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తనిఖీ విభాగం జిల్లా అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు.