భార్య, కుమార్తెలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెదనందిపాడు మండలంలోని పమిడివారిపాలేనికి చెందిన హృదయరాజు, రమాదేవిలకు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. హృదయరాజు మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండటంతో అతని నుంచి ప్రాణహాని ఉందని రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు.