గుంటూరు నగరంలోని 9వ డివిజన్లో సైడ్ కాలువలు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. బాగున్న కాలువలు పగలగొట్టవద్దని కార్పోరేటర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. బాగున్న వాటికి నిధులు దుర్వినియోగం చేయకుండా వేరే చోట వాడలని అశోక్ సూచించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదదయం 9 వ డివిజన్లో కాలువలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే ముస్తఫా అక్కడకు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేను స్థానిక మహిళాలు అడ్డుకున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న చోట కాలువలు కట్టాలని తెలిపారు. బాగున్న తమ వీధిలో కాలువలు పగలగొట్ట వద్దని స్థానిక మహిళలు మండిపడ్డారు.