రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు, మోటార్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..... ఏపీ ప్రజల నుంచి దోచుకుంటున్న రూ.17వేల కోట్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఏ ఫిర్యాదులేని మార్గదర్శిపై విశ్వసనీయత దెబ్బతీయటమే లక్ష్యంగా విచారణ చేస్తున్న సీఐడీకి, ప్రజలు జేబులు దోచుకునే ఇంత పెద్ద కుంభకోణాలు పట్టవా? అని ప్రశ్నించారు. మోటర్ల రేటు కంటే మీటర్ల రేటు రెండింతలు ఎలా ఎక్కువో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.