ఖరీఫ్ సీజన్‌కు సాగునీటీ ఏపీ సర్కార్ విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు నీటిని విడుదల చేశారు. ఈరోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల కానుంది. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. మంత్రి అంబటి రాంబాబు తొలుత శాస్త్రోక్తంగా పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టారు. అనంతరం పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను ప్రజాప్రతినిధులు, అధికారులు కాలువలోకి వదిలారు.