రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దేవుడు కరుణించాడని అన్నారు. వరుణ దేవుడి కరుణ కటాక్షాలతో జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని తెలిపారు. రైతులకు పంటలు పండి మంచి దిగుబడి వచ్చిందన్నారు. నాలుగేళ్లల్లో రైతుల నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేశారన్నారు. వైఎస్ హయాంలో పులిచింతల శరవేగంగా పనులు చేశారని తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ఇస్తున్నామన్నారు. పోలవరం వ్యయం పెంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా చేశారని, రూ.12,900కోట్ల నిధులు కేంద్రం నుంచి తెప్పించగలిగారని అన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుందని అన్నారు. ఢిల్లీ వెళ్లి ఏం పీకారు అన్న వారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలని మంత్రి జోగి రమేష్ హితవుపలికారు.