కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్య మైనట్లు మాధవరం ఎస్ఐ కిరణ్ బాబు తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి ఈనెల 4న సుంకేశ్వరి గ్రామంలో జరిగే ఏరువాక పౌర్ణమి సంద ర్భంగా బంధువులు ఇంటికి వెళ్లారు. అయితే అదే రోజు రాత్రి నుంచి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దిగులుతో సొంత గ్రామానికి వచ్చారు. ఇంటి దగ్గర లేకపోవడంతో బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల దగ్గర గాలించారు.ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు మాధవరం పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.