బుధవారం శృంగవరపుకోట మండలం, శృంగవరపుకోట గ్రామంలోని విశ్వబ్రాహ్మణ & ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు & గ్రామ పెద్దలు సమక్షములో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయము కమిటీ సభ్యులకు రూ. 10, 000/- విరాళం అందజేయడం జరిగింది. అనంతరం కోళ్ల దంపతులను ఆలయ వేద పండితులు ఆశ్వీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు జి. ఎస్. నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి బీశెట్టి అరుణ, వార్డు మెంబర్లు పెదగాడ లక్ష్మి, గొడుపు నాగమణి, ఐటీడిపి రాష్ట్ర కార్యదర్శి చెక్కా కిరణ్ కుమార్, విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాపుగంటి శ్రీనివాసరావు, పెదగాడ రాజు, గొడుపు బ్రహ్మాజీ, అక్కిరెడ్డి వెంకటరమణ, విశ్వబ్రాహ్మణ & ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.