కొమరాడ మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా గత ఏడాది. చేపట్టిన పనులకు సంబంధించి పబ్లిక్ హీయరింగ్ బుధవారం జరుగుతున్నట్లు కొమరాడ ఏపీవో బాలకృష్ణ తెలిపారు. గత వారం రోజులుగా మండలంలో వివిధ గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం సామాజిక బృందం చేపట్టిన సోషల్ ఆడిట్ నివేదికలను పబ్లిక్ హీయరింగ్ లో చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, వేతనదారులు, సిబ్బంది హాజరు కావాలని కోరారు.