గజరాజుల గుంపు కొమరాడ మండలం చెక్కవలస గ్రామ పరిసర ప్రాంతాలలో తిష్ట వేశాయి. దీంతో రైతులు సమీప ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం చెక్కవలస గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు ఉన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పంట పొలాలోకి రైతులు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.