కురుపాం మండలంలోని అంటిజోల గిరిజన గ్రామంలో 104 ఆధ్వర్యంలో బుధవారం ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి. ప్రజ్ఞ హాజరై 92 మందికి వైద్య సేవలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అనంతరం బాలింతలకు, పక్షవాతంతో బాధపడిన వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించి అవసరమైన సూచనలు సలహాలు అందించారు.