కెనడాలో భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భారతీయ విద్యార్థుల్లో సుమారు 700 మంది నకిలీ అడ్మిషన్ లెటర్లతో దేశంలోకి అడుగుపెట్టారని ఆరోపిస్తూ కెనడా ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ఈ క్రమంలో బలవంతంగా దేశం దాటించే ప్రయత్నాలను విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో మిస్సుసాగా సిటీలోని కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) ప్రధాన కార్యాలయం ముందు భారతీయ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.