ఏపీ సీఎం జగన్ నేడు ఈ-ఆటోలను పంపిణీ చేయనున్నారు. చెత్త సేకరణ కోసం పర్యావరణ హితంగా 516 విద్యుత్ ఆటోలను తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేస్తారు. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ రూ. 4.10 లక్షలు కాగా, 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 21.18 కోట్లు వెచ్చించింది.