ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను అందించే దిశగా 'సురక్షా చక్ర' పేరుతో ఈనెల 15 నుండి కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, గృహ సారథులు నెల రోజులపాటు ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలన చేయనున్నారు. పథకాలకు అర్హత ఉన్నవారిని గుర్తించి వారే దరఖాస్తు చేయిస్తారు. పథకాలు అందుతున్న వారికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతారు.