భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగింది. పూజారివాండ్లపల్లెకు చెందిన శ్రీధర్(43) 17 ఏళ్ల క్రితం మమతను ప్రేమ వివాహం చేసుకోగా, ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భార్యభర్తలకు గొడవలు జరుగుతుండడంతో మమత పుట్టింటికి వెళ్లింది. బుధవారం రాత్రి 3 గంటల సమయంలో ఇంటిపై నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కుటుంబ సభ్యులు శ్రీధర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.