ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు అహ్మదాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని డిగ్రీ పట్టాపై వ్యాఖ్యల కేసులో జులై 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బుధవారమే కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, వారి తరపు లాయర్లు మినహాయింపు కోరారు. దీంతో జులై 13న వారిద్దరూ తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.