ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రేబీస్ వ్యాధి సోకకుండా హైరిస్క్ గ్రూపులో ఉన్న వారికి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. మున్సిపల్ కార్మికులు, వెటర్నరీ సిబ్బంది, హైరిస్క్ జాబితాలో ఉన్న ఇతర సిబ్బందికి రేబీస్ వ్యాక్సిన్ వేయనున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.