కృష్ణాజిల్లా యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్(24) తెనాలిలోని మేనత్త ఇంటికి వచ్చి అక్కడే ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అక్కడ హర్షప్రియ అనే యువతిని ప్రేమించి మార్చి 8న పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నాడు. ఈనెల 6న రాత్రి 10 గంటలకు తండ్రితో ఫోన్ మాట్లాడి, అనంతరం ఇంట్లోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.