మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్‌ను రేపు మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాశ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత కోరారు.