ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్‌పై రేపు (శుక్రవారం) విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి నిన్న రాఘవకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఈడీ సవాలు చేసింది. రేపు విచారణకు స్వీకరించాలని ఈడీ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్‌కు ఆయన చూపిన కారణాలు సరైనవి కావని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో రాఘవ బెయిల్‌పై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ అంగీకారం తెలియజేసింది.