నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. దీంతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా వర్షం కురుస్తోంది. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించాయని, 48 గంటల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.