నోట్ల ఉపసంహరణ, కొత్త నోట్ల ముద్రణపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్ల ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని వెల్లడించారు. మొత్తం రూ.3.62 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని, వీటిలో దాదాపు రూ.1.82 లక్షల కోట్లు (50 శాతం) వెనక్కి వచ్చాయన్నారు.