టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో అఖిలప్రియను, భార్గవ్ రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియకు కోర్టు ఇంతకు ముందే బెయిల్ మంజూరు చేయగా.. ఇప్పుడు భార్గవ్ రామ్‌కు కూడా బెయిల్ వచ్చింది.